బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మిథాలీ రాజ్ భేటీ
TeluguStop.com
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు.
తెలంగాణ పర్యటనకు వచ్చిన జేపీ నడ్డా.హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా నడ్డా మిథాలీ రాజ్ కు శాలువా కప్పి సత్కరించారు.అనంతరం ఇరువురి మధ్య కాసేపు చర్చ జరిగింది.
అయితే, ఈ భేటీకి గల కారణాలపై స్పష్టత లేదు.మరోవైపు ఇటీవలే క్రికెట్ ను వీడిన మిథాలీ రాజ్.
రాజకీయ అరంగేట్రం చేస్తారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది.