సూర్యాపేటలో యువకుని మిస్సింగ్‌…?

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం టేకుమట్ల గ్రామంలో నివాసం ఉండే ఓ యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతుంది.

వివరాల్లోకి వెళితే.నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన నందికొండ వెంకన్న @వెంకటేష్ మూడురోజుల నుండి కనిపించడం లేడని,కిడ్నాప్ కు గురైనట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

మూడేళ్ల క్రితం కట్టంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో వెంకటేష్ నిందితుడిగా ఉన్నట్లు,అప్పటి నుండి గ్రామానికి దూరంగా ఉంటూ గత ఆరు నెలలుగా సూర్యాపేట మండలం టేకుమట్ల బంధువుల ఇంట్లో ఉంటూ సూర్యాపేటలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే వెంకటేష్ బైక్ ను రాజుగారి తోట హోటల్ సమీపంలో రూరల్ పోలీసులు గుర్తించారు.

స్కూళ్లో చేర్చుతామని .. అమెరికా తీసుకొచ్చి వెట్టిచాకిరీ, భారతీయ జంటకు జైలుశిక్ష