అదృశ్యమైన హాస్టల్ విద్యార్థులు!..నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్న హాస్టల్ వార్డెన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని గిరిజన క్రీడల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 10 రోజుల నుండి కనిపించకుండా వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దుమ్ముగూడెం మండలం బండిరేవు గ్రామానికి చెందిన విద్యార్థులు పూనేం సతీష్,గొంది జయంత్ లు ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటూ, కిన్నెరసాని గిరిజన క్రీడల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు.

ఈనెల 19వ తారీఖున కూడా విద్యార్థుల తల్లితండ్రులు ప్రభుత్వ బాలుర హాస్టల్ కు వచ్చి విద్యార్థులను కలిసి వెళ్లారు.

ఆ మరుసటి రోజు నుండే విద్యార్థులు హాస్టల్లో కనిపించడం లేదు వారం రోజుల తరువాత తోటి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పేవరకు తల్లిదండ్రులకు విషయం తెలియదు.

తమ పిల్లలు హాస్టల్ లోనే ఉండి చదువుకుంటున్నారనే అనుకుంటున్నారు.విషయం తెలిశాక హాస్టల్ వార్డెన్ పురుషోత్తం కు ఫోన్ చేసి అడుగగా నిర్లక్షపు సమాధానం చెప్పి మీరు వచ్చి వెతుక్కోండి అని చెప్పడం గమనార్హం.

హుటాహుటిన తల్లితండ్రులు హాస్టల్ కు చేరుకొని వార్డెన్ ను నిలదీయడంతో నాకు రెండురోజుల టైమ్ ఇవ్వండి ఎవరికి చెప్పకండి నేను వెతికి తీసుకువస్తా మీరు కూడా పాల్వంచ చుట్టు ప్రక్కల వెతకండి అని చెప్పాడు.

అమాయక గిరిజనులు కావడంతో తిండి తిప్పలు లేకుండా కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పాల్వంచలో తిరుగుతూ పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ లో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కిన్నెరసాని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో సుమారు 350 మంది విద్యార్థులు ఉన్నారు.

అందులో ఎవరినీ ఏమి చూసుకుంటాం వారు ఇంటికి వెళ్లిపోయారేమో అనుకున్నా అని హాస్టల్ వార్డెన్ చెప్పడం.

ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అదీ బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి వారిని నమ్మి పిల్లలను హాస్టల్ కు పంపితే ఇలాంటి సమాధానం చెప్పడం విస్మయానికి గురిచేస్తుంది.

విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల వార్డెన్ లు,ఉపాధ్యాయులు స్థానికంగా ఉండకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ పిల్లలను వెతికి పెట్టాలని నిర్లక్షయంగా వ్యవరించిన పాఠశాల వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

బోయపాటి, బాలయ్య సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?