అద్భుతం: తప్పిపోయిన కుక్క తిరిగి రావడమే కాదు.. డోర్‌బెల్ మోగించి షాకిచ్చింది!
TeluguStop.com
యూఎస్‌లో క్రిస్మస్( Christmas ) వేళ ఓ అద్భుతం జరిగింది.తప్పిపోయిన కుక్క( Missing Dog ) తిరిగి రావడంతో ఫ్లోరిడాలోని( Florida ) ఓ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
వివరాల్లోకి వెళితే, గ్రీన్ కోవ్ స్ప్రింగ్స్ సిటీలోని( Green Cove Springs ) కమర్ ఫ్యామిలీ ఎథీనా( Athena ) అనే జర్మన్ షెపర్డ్-హస్కీ మిక్స్ కుక్కని పెంచుతోంది.
అయితే అది అనుకోకుండా డిసెంబర్ 15న తప్పిపోయింది.దాంతో ఆ కుటుంబ సభ్యులు ఎథీనా కోసం తీవ్రంగా వెతికారు.
4 పిల్లలతో కూడిన కమర్ కుటుంబం( Comer Family ) ఎథీనా కోసం గాలింపు ముమ్మరం చేసింది.
వాళ్లు గోడ పత్రికలు, డిజిటల్ ఫ్లైయర్లు పంచారు.ఇంటి డోర్‌బెల్ కెమెరా ఫుటేజీలను గంటల తరబడి పరిశీలించారు.
చుట్టుపక్కల వాళ్ల సాయంతో గల్లీ గల్లీ వెతికారు.జాక్సన్‌విల్లే, సెయింట్ అగస్టీన్ ప్రాంతాల వాళ్లు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
క్రిస్మస్ దగ్గర పడుతుండటంతో ఆశలు సన్నగిల్లాయి. """/" /
కానీ, క్రిస్మస్ ముందు రోజు తెల్లవారుజామున 2:30 గంటలకు ఊహించని ఘటన చోటు చేసుకుంది.
ఎథీనా స్వయంగా ఇంటికి తిరిగొచ్చింది.అంతేకాదు, తన పాదంతో డోర్‌బెల్ మోగించింది! ఆ దృశ్యం డోర్‌బెల్ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది.
యజమాని బ్రూక్ కమర్( Brooke Comer ) డోర్‌బెల్ శబ్దానికి లేచి చూసేసరికి ఎథీనా తలుపు ముందు నిలబడి ఉంది! ఆనందంతో ఆమెకు మాటలు రాలేదు.
ఆమె సైలెంట్‌గా ఉండాలని ప్రయత్నించినా, పిల్లలు లేచి తమ ప్రియమైన కుక్కను చూసి సంబరపడిపోయారు.
"""/" /
ఎథీనా తిరిగి రావడంతో కమర్ కుటుంబం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది.
ఎందుకంటే అది కేవలం ఒక రీయూనియన్ కాదు, భావోద్వేగాల సునామీ.ఎథీనా తన యజమాని కుటుంబాన్ని మళ్లీ చూడగానే ఆనందంతో గెంతులేసింది, వెక్కివెక్కి ఏడ్చింది, అరుస్తూ తన ప్రేమను చాటుకుంది.
ఆ దృశ్యం చూసిన వాళ్ల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.ఇలాంటి సంఘటన మళ్లీ జరగకూడదని కమర్ కుటుంబం గట్టి నిర్ణయం తీసుకుంది.
ఎథీనాకు మైక్రోచిప్ వేయించాలని, స్టెరిలైజేషన్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు.అలా ఈ అద్భుతమైన క్రిస్మస్ గిఫ్ట్ కమర్ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు.
జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?