ఇనార్బిట్ మాల్‌లోని సెంట్రో గ్రాండే లో మిస్ ఇండియా 2022

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పాదరక్షల కేంద్రమైన, సెంట్రో తన రొండో ప్రీమియం పాదరక్షల లాంజ్, సెంట్రో గ్రాండేను ఇనార్బిట్ మాల్‌లో ఆదివారం ప్రారంభించింది.

ఫెమినా మిస్ ఇండియా విజేతలు సినీ శెట్టి, రూబల్ షెకావత్ మరియు షినాతా చౌహాన్‌లు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

పింక్ లీఫ్ వెడ్డింగ్‌, పండుగ‌ల‌కు ప్ర‌త్యేక‌మైన పాద‌ర‌క్ష‌ల డిజైన్ల‌ను వీరు ముగ్గురు క‌లిసి ఇక్క‌డ ప్రారంబించారు.

సెంట్రో గ్రాండేలో ప్రదర్శించే పింక్ లీఫ్ సేకరణలో కొత్త ట్రెండ్‌లు మరియు రాబోయే పెళ్లి & పండుగ సీజన్‌ల కోసం పాదాల అవసరాలకు అనుగుణంగా విస్తృమైన శ్రేణి ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ అందుబాటులో ఉంచారు.

సంగీత్, మెహందీ, రిసెప్షన్ లేదా పండుగ మరియు కాక్‌టెయిల్ పార్టీల‌కు ఈ స‌రికొత్త పాద‌ర‌క్ష‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలువనున్నాయి.

ఈ ఆవిష్కరణ సందర్భంగా సెంట్రో గ్రాండే మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ గణేష్ మాట్లాడుతూ.

ఒక స‌రికొత్త అనుభూతిని మిగిల్చేందుకు ఈ స్టోర్ చ‌క్క‌ని వేదిక‌గా నిలుస్తుంద‌న్నారు.మ‌న వ‌స్త్రోత్ప‌త్తుల తీరులో, మ‌న ఆహార్యంలో పాద‌ర‌క్ష‌లకు ప్ర‌త్యేక‌మైన స్తానం ఉంద‌న్నారు.

ఇప్పుడు చాలా మంది సౌక‌ర్య‌వంతంగా ఉండే పాద‌ర‌క్ష‌ల‌తోపాటు మ‌న అందాన్ని ద్విగుణీకృతం చేసే పాద‌ర‌క్ష‌ల కోసం చూస్తు్న్నార‌న్నారు.

అలాంటి వారి కోసం ఉత్తమ బ్రాండ్‌లు, స‌రికొత్త స్టైల్స్‌, సౌక‌ర్యం, అప‌రిమిత ఎంపిక ఇక్క‌డ అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు.

ఇప్ప‌టికే త‌మ మొద‌టి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను జూబ్లీహిల్స్‌లో దాదాపు 12000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేయ‌గా, రెండో స్టోర్ ను ఇనార్బిట్ మాల్‌లో 8000 చ‌ద‌ర‌పు అడుగుల‌లో ఏర్పాటుచేస్తున్నామ‌న్నారు.

"""/"/ అంత‌ర్జాతీయ ఉత్ప‌త్తులు.సెంట్రో గ్రాండేలో అంత‌ర్జాతీయ ఉత్ప‌త్తుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇందులో భాగంగా TOMS, HOKA, BIRKENSTOCK మొదలైన అంతర్జాతీయ పాదరక్షల ఫ్యాషన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

వీటితోపాటు Crocs, Miratti, Moujutti, Clarks, Fitflop, Puma, Nike, Skechers, Neeman's వంటి ప్రసిద్ధ బ్రాండ్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

సెంట్రో గ్రాండేలోని బెస్పోక్ లాంజ్లో టైలర్ మేడ్, హ్యాండ్‌క్రాఫ్ట్ షూస్‌ను ప్రతి పాదానికి మరియు సందర్భానికి సరిపోయేలా పరిపూర్ణంగా తయారు చేయబడిన మొట్టమొదటి స్టోర్‌గా తీర్చిదిద్దారు.

కాబట్టి స్టైల్‌లో తమ పాదాలను విలాసపరచాలని చూస్తున్న వారందరికీ, సెంట్రో గ్రాండే సరైన ఎంపిక.

సూర్యాపేటలో రెండో రోజు కేసీఆర్ బస్సు యాత్ర..!