రాజకీయ లబ్ది కోసం కావాలనే ప్రభుత్వం పై దుష్ప్రచారం..మేకతోటి సుచరిత

గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రిజమ్ ల్యాబోరేటరీస్ వద్ద హోంమంత్రి మేకతోటి సుచరిత గారు మీడియా తో మాట్లాడటం జరిగింది.

విశాఖ ఉక్కు పై పవన్ కళ్యాణ్ దీక్ష, చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారం, మూడు రాజధానులు వంటి అంశాలపై హోం మినిస్టర్ మాట్లాడటం జరిగింది.

మేకతోటి సుచరిత గారు - హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాత్యురాలు.

బీజేపీ తో అక్కడ మిత్రులు అన్న వాళ్లు ఇక్కడ మాత్రం శతృత్వం అన్న విధంగా దీక్షలు చేస్తున్నారు.

ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు దీక్ష చేస్తున్నారో మాకు అర్దం కావడంలేదు.కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉక్కు పరిశ్రమను ప్రవేటీకరణ చేస్తే రాష్ట్రం నష్టపోతుందని డిమాండ్ చేయవచ్చు కదా.

అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా అమరావతి, విశాఖపట్నం, కర్నూలు వంటి నగరాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు.

"""/"/ అమరావతిని పూర్తిగా తరలిస్తున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు.

ఇక్కడ ఒక ప్రాంతం రాజదానిగా ఉంటుందని చెప్పినప్పటికి పెట్టుబడి దారులు ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.

చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ది కలుగుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన విధంగా రాష్ట్ర అభివృద్ది జరుగుతుంది.

టీడీపీ రాజకీయ లబ్ది కోసం కావాలనే ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయిస్తోంది.రాజకీయాలకు అతీతంగా, కులాలకు, మతాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తోంది.

ఒక్కోఇంట్లో ఐదారు సంక్షేమ పథకాలను పొందుతున్నామని ప్రజలే స్వయంగా చెబుతున్నారు.

50,000 ఏళ్ల తర్వాత కూడా చెక్కుచెదరని బేబీ మముత్.. శాస్త్రవేత్తలు షాక్!