నాగపూర్ ఎన్ఐటి క్యాంపస్ రిక్రూట్మెంట్లో సత్తాచాటిన మిర్యాలగూడ వాసి

నల్లగొండ జిల్లా:ప్రముఖ ఒరాకిల్ ఎంఎన్సీ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇటీవల నాగపూర్ ఎన్ఐటిలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆయేషా తఖి( Ayesha Taqi ) సత్తా చాటింది.

ఒరాకిల్ ఎంఎన్సీ సాఫ్ట్ వేర్ డెవలపర్ గా ఎంపికై,రూ.34 లక్షల వార్షిక వేతనం అందుకోనుంది.

ఆయేషాతఖి తండ్రి మహమ్మద్ నుస్రత్ అలీ మిర్యాలగూడ(Miryalaguda ) బీసీ హాస్టల్ అధికారిగా,తల్లి అజ్మతున్నిసాబేగం ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నారు.

ఆయేషాతఖి 1 నుంచి 4 వరకు మిర్యాలగూడలోని శ్రీవిద్యోదయ పాఠశాలలో, ఐదు డాక్టర్ మువ్వా రామారావుకు చెందిన జ్యోతి స్కూల్లో,6 నుండి 8 వరకు(2014-17) నేరేడుచర్ల మండలం చిల్లేపల్లిలోని సిటీ సెంట్రల్ స్కూల్లో,9,10 తరగతులు మిర్యాలగూడ లోని ఎస్.

పి.ఆర్.

స్కూల్ లో (2017- 19),ఇంటర్ (2019-21) వరకు శ్రీచైతన్య కళాశాల హైదరాబాదులో విద్యనభ్యసించింది.2021 జేఈఈ మెయిన్స్ లో 99.

22% 8054 ఓపెన్ కేటగిరిలో ఆల్ ఇండియా ర్యాంక్)సాధించి నీట్ నాగపూర్ లో సి.

ఎస్.ఈలో చేరింది.

జాన్ డీర్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా ఇంటర్మ్ షిప్ పూర్తి చేసి,ఒరాకిల్ ప్రాంగణ నియామాకల్లో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా ఎంపికైంది.

ఈ సందర్భంగా ఆయేషాతఖి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు నుస్రత్ అలీ, అజ్మతునిసాబేగంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులైన బాబాయిలు ఇప్తేకర్అలీ, అబ్దుల్ రహీం,అబ్దుల్ కరీం, మామయ్యలు ఎండి సలీం, ఎండి కలీం,గురువుల ఆశీర్వాదంతో ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా సహకరించిన వారికి,గురువులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సాప్ట్ వేర్ రంగంలో సత్తా చాటిన ఆయేషాతఖికి సీనియర్ జర్నలిస్ట్ ఎండి అస్లంతో పాటు, పలువురు అభినందనలు తెలిపారు.

ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మీ దంతాలు తెల్లగా తల తల మెరిసిపోవడం ఖాయం!