డంపింగ్ యార్డ్ తనిఖీ చేసిన మిర్యాలగూడ ఎమ్మేల్యే లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా( Nalgonda District ):నేను నా మిర్యాలగూడ పట్టణం అనే నినాదంతో ముందుకు పోతున్న ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి, చెత్తను సేకరించే మున్సిపల్ వాహనాలు సరిగా రావడం లేదని పట్టణ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుతో మంగళవారం డంపింగ్ యార్డ్ ను సందర్శించారు.

డంపింగ్ యార్డ్ నందు గల చెత్త సేకరించే వాహనాల రిజిస్టర్ పరిశీలించి,వాహనాల వివరాలు,ఎన్ని ట్రిప్పులు తీరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.

ఫిర్యాదులు వస్తున్నాయని,ప్రతీ వాహనం రిడింగ్ కూడా ప్రతీ రోజు రిజిస్టర్ లో ఉంచాలని సిబ్బందికి సూచించారు.

అనంతరం డంపింగ్ యార్డ్( Dumping Yard ) అంతా తిరిగి చూసి అక్కడ పనులు సరిగా లేవని మున్సిపల్ ఇన్చార్జికి కాల్ చేసి ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ సందర్శించి వాహనాల వివరాలు,ఇక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు.

అనంతరం వాహనాల డ్రైవర్స్ తో మాట్లాడుతూ మీరు చేసే ఉద్యోగం నాయకుల కోసం కాదని,నాయకులకు భయపడుతూ చేయకండి, ప్రజల కోసం పని చేయండి, నిజాయతీగా పని చేస్తే మీకు తోడుగా నేను ఉంటానని,మీ సమస్యలు ఏమి ఉన్నా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం మున్సిపల్ కమిషనర్( Municipal Commissioner) కి కాల్ చేసి డంపింగ్ యార్డ్ లోకి వాహనాలు వెళ్ళే దారి సరిగా లేదని,కావున వెంటనే సాయంత్రం వరకు మున్సిపల్ డోజెర్స్ తో చెత్తని ఒక దగ్గర చేసి దారి చేయాలని సూచించారు.

మిర్యాలగూడ పట్టణం ఉత్తమ పారిశుధ్య పట్టణంగా తీర్చిదిద్దాలని నేను ప్రయత్నం చేస్తున్నానని,దానికి అధికారులు,కార్మికులు,ప్రజలు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.

వైరల్ వీడియో: అయ్య బాబోయ్.. ఎర్ర చీమలతో చట్నీ.. మీరు ట్రై చేస్తారా..?