వరుస మరణాలతో విషాదంలో మిర్యాలగూడ…!

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా మిర్యాలగూడ( Miryalaguda ) పట్టణ పరిధిలో గత మూడు రోజుల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో నలుగురు మరణించడంతో పట్టణంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.మిర్యాలగూడ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై సీతారాంపురం కాలానికి చెందిన తన్నీరు సాయికిరణ్ (24) మంగళవారం మృతి చెందాడు.

స్థానికంగా ఒక ప్రైవేట్ సంస్థలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్న మృతుడు అదే కాలానికి చెందిన మైనర్ బాలికను గత నాలుగేళ్ళుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

ఈ విషయమై 2022 లో పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది.ఈ క్రమంలో ఈనెల 28న మృతుడు బాలిక ఇంటివద్దకు వెళ్లి గొడవపడ్డాడు.

బాలిక తల్లి మరుసటి రోజు ఉదయం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

తల్లి ఫిర్యాదు మేరకు టూ టౌన్ సీఐ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.

ఇది తెలుసుకున్న సాయికిరణ్ తాను చనిపోతున్నట్టు వాట్సాప్ స్టేటస్ సమాచారం ఇచ్చి,రైలు కింద పడి శవమై కనిపించాడు.

రైల్వే డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు.

వైద్యుల నిర్లక్ష్యం కారణంతోనే మృతి చెందాడని మృతుని బంధువులు స్థానికులు పెద్దఎత్తున హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన కొండపల్లి శేఖర్ మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన శేఖర్ ని మిర్యాలగూడ పట్టణంలోని మ్యాక్స్ కూర్ ఆస్పత్రికి తరలించారు.

ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందిస్తామంటూ మభ్యపెట్టి ఫీజు రూపంలో వేలాది రూపాయలు దండుకొని బుధవారం మృతి చెందినట్లు చెప్పారని ఆరోపించారు.

వైద్యుల నిర్లక్ష్యంతోనే శేఖర్ మృతి చెందాడని ఆగ్రహించిన బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు.

సమాచారం అందుకున్న మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఎస్ఐ శీను నాయక్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.

డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.మృతునికి భార్య ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఆ రెండు ఘటనలు మరవక ముందే మిర్యాలగూడ పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఐలాపురం వద్ద గూడ్స్ ట్రైన్ కిందపడి గురువారం ఉదయం ఇద్దరు (ప్రేమజంట)ఆత్మహత్య చేసుకున్నారు.

మృత్తులు మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం దుర్గానగర్ చెందిన ధనలక్ష్మి,దుర్గాప్రసాద్ గా పోలీసులు గుర్తించారు.

వివాహేతర సంబంధమే ఆత్మహత్య కారణమని భావిస్తున్నారు.మృతుని తల్లి తన కుమారుని మృతిపై అనుమానంగా ఉన్నదని నిందితులను పట్టుకొని శిక్ష పడేవిధంగా చేయాలని వేడుకున్నది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రెండు రోజుల్లో మిర్యాలగూడ పట్టణ పరిధిలో నలుగురు మృతి చెందడంతో పట్టణ ప్రజలు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.

దేవర రిజల్ట్ ఏంటి..? కొరటాల ఎన్టీయార్ కి మరో సక్సెస్ ఇచ్చాడా..?