ఎనిమిదేళ్లకే అద్భుత ప్రతిభతో వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించిన మిర్యాలగూడ చిన్నోడు..
TeluguStop.com
ప్రస్తుత రోజులలో పిల్లల టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పెద్దవారికె విషయాలు నేర్పించే విధంగా రోజులలో పిల్లలు ఉన్నారు.అంతలా వారి టాలెంట్ కూడా ఉంది.
ఈ క్రమంలో తాజాగా 8 సంవత్సరాల పిల్లవాడి టాలెంట్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మనం ఎవరైనా సాధారణంగా ఒక అయిదారు రాష్ట్రాలు వాటి రాజధానుల పేర్లు సులభంగానే గుర్తుకు పెట్టుకుంటాము.
మహా అయితే ఒక పది రాష్ట్రాలు వాటి రాజధాని పేరును సులువుగా పెట్టుకుంటారు.
కానీ., ఈ చిన్న పిల్లవాడు మాత్రం దేశంలోని రాష్ట్రాలు వాటి రాజధానుల పేర్లు ఎటువంటి తడపాటు లేకుండా చాలా సులువుగా చెప్పేస్తున్నాడు.
అంతేకాకుండా ఈ పిల్లవాడి టాలెంట్ తో వరల్డ్ రికార్డు ( World Record )లో కూడా స్థానం సొంతం చేసుకున్నాడు.
"""/" /
ఇంతకీ ఆ పిల్లవాడు ఏ ప్రాంతానికి చెందిన వాడన్న విషయానికి వస్తే.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ( Miryalaguda ) పట్టణ వాసి.నవీన్ కుమార్, శ్వేతా దంపతులు హాస్పిటల్ నిర్వహిస్తూ ఉంటారు.
వీరి ఇద్దరికీ ఎనిమిది సంవత్సరాలు గల పిల్లడుమనో శ్రీరామ్( Manu Sriram ) ఈ అబ్బాయి స్థానిక సంస్కృతి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు.
ఈ పిల్లవాడు అతి చిన్న వయసులోనే తనలోని ఉన్న టాలెంట్ ను ఎప్పటికప్పుడు నిరూపించుకొని ప్రశంసలు పొందుతుండేవాడు.
"""/" / తాజాగా ఈ పిల్లవాడు దేశంలోని రాష్ట్రాలు రాజధానులు కేవలం 15.
8 సెకండ్ లో తెలియచేసి ప్రపంచ రికార్డ్స్ లో సొంతం చేసుకున్నాడు.ఆడుతూ పాడుతూ ఉండే సమయంలో ఈ చిన్న పిల్లవాడు ఇలాంటి ప్రపంచ రికార్డులను సాధించడంతో వారి తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు.
కాబట్టి మీ పిల్లలకి కూడా వారిలోని ట్యాలెంట్ ను గుర్తించి వారికీ ప్రోత్సహం ఇవ్వండి.
గేమ్ చేంజర్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పిన సెన్సార్ బోర్డు మెంబర్స్…ఆ రెండు సీన్లు ఫ్యాన్స్ కి కిక్కు ఇవ్వబోతున్నాయా..?