అఖండను అంతా అలా చూస్తుండిపోతారు : నిర్మాత

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు కూడా రెడీ అయ్యింది.

వచ్చే నెల డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.

ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో అఖండ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు మేకర్స్.

"""/"/ అందులో భాగంగానే ఈ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

కరోనా కంటే ముందే స్టార్ట్ చేసిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేయడంతో షూటింగ్ ఆలస్యం అయ్యింది.

ఇక కరోనా తర్వాత ఇప్పుడు సినిమాను విడుదల చేస్తున్నాం.పెద్ద సినిమాల ప్రయాణం కరోనా తర్వాత ఎలా ఉండబోతుందో అఖండ సినిమాతోనే తెలుస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమా పెద్ద సినిమా కావడంతో థియేటర్స్ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని అందరికి అనుమానాలు ఉన్నాయి.

కానీ మేము ఒక అడుగు ముందుకు వేసాము.ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఎలా? ఖచ్చితంగా ఈ సినిమాతో థియేటర్స్ దగ్గర పూర్వ వైభవం వస్తుంది.

మేము ముందుగా డిసెంబర్ 24న రావాలని అనుకున్నాం కానీ చివరకు డిస్టిబ్యూటర్స్ అందరం కలిసి డిసెంబర్ 2 అనేది సరైన డేట్ అని భావించి ముందుకు వస్తున్నాం.

"""/"/ ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన 20 నిముషాల తర్వాత చివరి వరకు అంతా కూడా అలా చూస్తూ ఉండిపోతారు.

ఈ సినిమా ఒక విజువల్ వన్డర్ లాగ ఉంటుంది.అఖండ అంటే అనంతం.

కాదనలేని సత్యం.ఈ సినిమా చూసాక ఆ టైటిల్ ఎందుకు పెట్టారో మీకు తెలుస్తుంది.

ఈ సినిమా కథకు అఖండ టైటిల్ పర్ఫెక్ట్ అని మీరే అంటారు.ఇక ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే ఎక్కువ స్క్రీన్స్ లో విడుదల అవుతుంది.

ఓవర్శిస్ లో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతుంది అని రవీందర్ రెడ్డి తెలిపారు.

కంది పంట విత్తుకునే విధానం.. ఎరువుల యాజమాన్యంలో మెళుకువలు..!