నరేష్ పవిత్ర రిలేషన్ పై మిర్చి మాధవి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
TeluguStop.com
ప్రముఖ నటి మిర్చి మాధవి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ప్రొడ్యూసర్ల గురించి కూడా ఆలోచించాలని ఆమె తెలిపారు.ఈరోజుల్లో థియేటర్లలో సినిమా చూడటం కష్టమైన టాస్క్ అయిందని ఆమె తెలిపారు.
మూవీకి 24 క్రాఫ్ట్స్ ఉంటాయని నేను నా పర్సనల్ మేకప్ మేన్ ను నాతో పాటు తీసుకెళతానని ఆమె అన్నారు.
నా నుంచి ఎవరికీ ఇబ్బంది కలగకూడదని నేను భావిస్తానని ఆమె కామెంట్లు చేశారు.
ప్రతిరోజూ నేను వర్క్ చేసే సమయంలో ఇక్కడినుంచి నాలుగు వర్క్స్ రావాలి తప్పితే ఇక్కడినుంచి నాలుగు వర్క్స్ పోకూడదని నేను భావిస్తానని అమె కామెంట్లు చేశారు.
శతమానం భవతి మూవీ సమయంలో నా ఫ్రెండ్ ఒకరు డిఫరెంట్ గా బిహేవ్ చేశారని ఆమె తెలిపారు.
గేలి చేయడం, వెకిలి చేయడం నాకు నచ్చదని ఆమె చెప్పుకొచ్చారు.థాట్స్ అనేవి కలుపులాంటివని ఆమె చెప్పుకొచ్చారు.
నేనెవరిపై ప్రాక్టికల్ జోక్స్ వేయనని ఆమె తెలిపారు.లైఫ్ లో కామెడీ షోలోగా వాళ్లపై వీళ్లపై కామెడీ చేయడం నచ్చదని ఆమె చెప్పుకొచ్చారు.
పవిత్ర లోకేశ్, నరేష్ ల గురించి మనం ఏ విధంగా జడ్జ్ చేయగలమని ఆమె కామెంట్లు చేశారు.
నరేష్, పవిత్ర లోకేశ్ మేజర్స్ అని వాళ్ల వ్యక్తిగత జీవితాలను అంత హ్యూమిలేట్ చేయడం ఎందుకని మిర్చి మాధవి అన్నారు.
"""/"/
బయట చాలామంది చాలా చేస్తున్నా వాళ్ల గురించి బయటకు రావడం లేదు కదా అని మిర్చి మాధవి కామెంట్లు చేశారు.
నరేష్, పవిత్రల ఏముందో వాళ్లకు తెలుసని ఆమె అన్నారు.వాళ్ల సమస్యలు ఏంటో వాళ్లకు తెలుసని ఆమె తెలిపారు.
నరేష్ పవిత్రల సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉందో వాళ్లకు తెలుసని ఆమె కామెంట్లు చేశారు.
బన్నీ పుష్ప2 మూవీ టార్గెట్ లెక్కలివే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే అంత రావాలా?