ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ.. హనుమాన్ మూవీ ఫ్యాన్స్ కు ఇది బంపర్ ఆఫర్ అంటూ?

అయితే రామ మందిరం ప్రారంభోత్సవం( Ayodhya Ram Mandir ) సందర్భంగా హనుమాన్ సినిమాను ప్రదర్శిస్తున్న మిరాజ్ థియేటర్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

తమ థియేటర్లలో హనుమాన్ సినిమా( Hanuman Movie )కు సంబంధించి ఒక టికెట్ కొంటే మరో టికెట్ పొందే అవకాశం కల్పించారు.

ఎంపిక చేసిన లొకేషన్లలో ప్రస్తుతం ఈ ఆఫర్ అమలవుతోందని తెలుస్తోంది."MIRAJBOGO" అనే కోడ్ ను బుక్ మై షో యాప్ లేదా వెబ్ సైట్ లో ఎంటర్ చేసి టికెట్లు బుక్ చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

"""/"/ అయితే పరిమిత సంఖ్యలో థియేటర్లలో మాతమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని సమాచారం అందుతోంది.

ఈ నెల 22వ తేదీన మాత్రమే ఈ ఆఫర్ అమలు కానుంది.మిరాజ్ సినిమాస్( Miraj Cinemas ) ప్రకటించిన ఈ ఆఫర్ వల్ల హనుమాన్ సినిమాకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

అయితే కొంతమంది నెటిజన్లు తాము నివశించే ప్రాంతంలో ఈ ఆఫర్ వర్క్ కావడం లేదని చెబుతున్నారు.

ఏయే థియేటర్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉందో మిరాజ్ సినిమాస్ ప్రకటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు హనుమాన్ మూవీ ప్రస్తుతం ఇతర సంక్రాంతి సినిమాల కంటే బెటర్ కలెక్షన్లను సాధిస్తోంది.

తేజ సజ్జా, అమృతా అయ్యర్, ప్రశాంత్ వర్మలకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.

"""/"/ మరోవైపు అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహం ప్రతిష్టాపన కోసం కొంత సమయం మాత్రమే ఉండగా భక్త జనంతో అయోధ్య నిండిపోయింది.

1300 కోట్ల రూపాయల ఖర్చుతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా( Hindu Temples ) ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది.

మూడు బాల రాముడి విగ్రహాలను తయారు చేయించగా అరుణ్ యోగిరాజ్( Arun Yogiraj ) అనే శిల్పి తయారు చేసిన బాల రాముని విగ్రహాన్ని ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగింది.

దిగువ అంతస్తులో బాలరాముడి విగ్రహంతో పాటు పురాతన విగ్రహ దర్శనభాగ్యాన్ని కల్పించనున్నారు.

మోక్షజ్ఞ విషయంలో మాత్రమే ఎందుకిలా జరుగుతోంది.. నెటిజన్ల షాకింగ్ కామెంట్స్ వైరల్!