ఈ మిరాకిల్ రెమెడీని ట్రై చేస్తే మేకప్ లేకపోయినా మీ ముఖం వైట్ గా బ్రైట్ గా మెరిసిపోద్ది!
TeluguStop.com
సాధారణంగా కొందరి ముఖ చర్మం మేకప్ లేకపోయినా ఎంతో అందంగా, తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంది.
అటువంటి చర్మాన్నే అందరూ కోరుకుంటారు.అందుకోసం ఖరీదైన స్కిన్ వైట్నింగ్ బ్రైట్నింగ్ క్రీమ్, సీరంలను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పక్కన పెడితే..
ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ రెమెడీ మాత్రం మేకప్( Makeup ) లేకపోయినా మీ ముఖ చర్మాన్ని వైట్ గా, బ్రైట్ గా మెరిపిస్తుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిటికెడు కుంకుమ పువ్వు,( Saffron ) నాలుగు టేబుల్ స్పూన్లు పాలు,( Milk ) రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్పు బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు మరియు కుంకుమపువ్వు పాలను వేసుకునే స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
"""/" /
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై చేతి వేళ్ళతో ముఖాన్ని సున్నితంగా రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ బొప్పాయి పండు( Papaya ) ఫేస్ మాస్క్ వేసుకుంటే కనుక మీ ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.
"""/" /
చర్మం పై మొండి మచ్చలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.
మొటిమలు తగ్గుముఖం పడతాయి.స్కిన్ ఫుల్ గ్లోయింగ్ గా మారుతుంది.
డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.మేకప్ లేకపోయినా మీ ముఖ చర్మం అందంగా మెరిసిపోతుంది.
కాబట్టి సహజ అందాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.