డార్క్ సర్కిల్స్ ను మాయం చేసే మిరాకిల్ ఆయిల్ ఇది.. వారం రోజులు వాడినా చాలు!
TeluguStop.com
డార్క్ సర్కిల్స్( Dark Circles ) లేదా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు.
చాలా మంది చాలా కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.
ఈ డార్క్ సర్కిల్స్ మన ముఖంలో ఏదో లోపాన్ని ఎత్తి చూపుతున్నట్లు ఉంటాయి.
మన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.అందుకే కొందరు మార్కెట్లో లభ్యమయ్యే డార్క్ సర్కిల్స్ రిమూవల్ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పక్కన పెడితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ ఆయిల్ మాత్రం కేవలం వారం రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది.
పైగా ఈ ఆయిల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మిరాకిల్ ఆయిల్( Miracle Oil ) ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
"""/" /
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు హీట్ చేయాలి.
ఆ తర్వాత ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసి కనీసం ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
"""/" /
ఈ విధంగా ప్రతిరోజు చేస్తే కళ్ళ చుట్టూ ఎలాంటి నల్లటి వలయాలు( Dark Circles Arouund Eyes ) ఉన్నా సరే దెబ్బకు పరార్ అవుతాయి.
డార్క్ సర్కిల్స్ ను నివారించడానికి ఈ మిరాకిల్ ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
పైగా ఈ ఆయిల్ ను వాడితే కళ్ల వద్ద మడతలు, చారలు వంటివి ఉన్న సరే క్రమంగా మాయం అవుతాయి.
బాలీవుడ్ కి టాలీవుడ్ కి మధ్య అసలైన పోటీ ఇప్పుడే మొదలైందా..?