జూన్ 10న ఆకాశంలో అద్భుతం.. ఈ 7 రాశుల వారికి అదృష్ట యోగం..?

జూన్ 10 వ తేదీన ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది.72 సంవత్సరాల తర్వాత ఈ అద్భుతం ఆకాశంలో జరగనుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆకాశంలో జరిగే ఈ అద్భుతాన్ని చూడడానికి ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు.జూన్ 10వ తేదీన సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

72 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే ఈ విధమైనటువంటి సూర్య గ్రహణం ఈ సారి భారతదేశంలో మినహా ఇతర దేశాలలో కనువిందు చేయనుంది.

జూన్ 10 2021 కృష్ణపక్ష అమావాస్య రోజున ఏర్పడే సూర్య గ్రహణం ఆస్ట్రేలియా, బెలారస్, బెల్జియం, కెనడా, చైనా, ఘనా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్లాండ్, హంగరీ, ఐస్లాండ్, ఐర్లాండ్ వంటి మొదలగు ప్రాంతాల్లో సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

జూన్ పదవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం భారత దేశంలో ఎక్కడా కనిపించక పోవడం వల్ల భారతదేశంలోని ఆలయాలను యధావిధిగా తెరిచి పూజలు చేస్తారు.

ఈ రోజున ఏర్పడే సూర్య గ్రహణం వల్ల మన దేశంలో ఎలాంటి దుష్ప్రభావాలు ఏర్పడవని, ఈ సూర్య గ్రహ ప్రభావం మనదేశంలో ఉండదని పండితులు చెబుతున్నారు.

ఈ సూర్య గ్రహణం వల్ల కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కొంతమేర జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

"""/"/ 72 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే ఈ సూర్యగ్రహణం పై శని, బుదుడు తిరోగమనం చెందుతారు.

దీంతో పాటు సూర్యుడు, బుధుడు, చంద్రుడు, రాహుల శుభ కలయిక కూడా ఏర్పడుతోంది.

ఇది చాలా అరుదైన కలయిక.అదేవిధంగా ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకమైనది.

ఈ అమావాస్య రోజు వటసావిత్రి వ్రతం, శని జయంతి కూడా ఇదే రోజు కావడంతో ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఈ విధంగా గ్రహాల కలయిక వల్ల ఈ అమావాస్య రోజు నుంచి ఈ 7 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మేషం, మిధున, కర్కాటక రాశి, కన్య, మీనం, తుల, మకరం వారికి అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.

"""/"/ జూన్ 10వ తేదీన ఏర్పడే సూర్య గ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్ గా కనిపిస్తుంది.

సూర్యుడు కేవలం రింగ్ ఆకారంలో మాత్రమే మనకు కనిపించడం వల్ల ఈ గ్రహణాన్ని కంకణ కృతి గ్రహణం అని కూడా పిలుస్తారు.

ఈ సూర్య గ్రహణ సమయంలో సూర్యుడిని 94% చంద్రుడు కప్పి వేయటం వల్ల పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

ఈ విధమైనటువంటి గ్రహణం ఏర్పడే చోట ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

నేడు ఢిల్లీకి చంద్రబాబు ! అమిత్ షా కరుణిస్తారా ?