మొటిమలతో ముఖం మొత్తం అసహ్యంగా మారిందా.. 10 రోజుల్లో క్లియర్ స్కిన్ ను పొందండిలా!
TeluguStop.com
ఆహారపు అలవాట్లు, హార్మోన్ల ప్రభావం, పెరిగిన కాలుష్యం, మృత కణాలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల కొందరికి ముఖం మొత్తం మొటిమలు ఏర్పడుతుంటాయి.
మొటిమల కారణంగా ముఖం చాలా అసహ్యంగా కనిపిస్తుంది.అలాంటి ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా కొందరు భయపడుతుంటారు.
ఈ క్రమంలోనే మొటిమలను ( Pimples )నివారించుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన క్రీమ్, సీరం లను కొనుగోలు చేసి వాడుతుంటారు.
కానీ ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా సులభంగా మొటిమలు మరియు వాటి తాలూకు మచ్చలను పోగొట్టుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ రెమెడీ సూపర్ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది.
మరి ఇంతకీ మొటిమలను మాయం చేసే ఆ మిరాకిల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ) వేసుకుని అరకప్పు వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
"""/" /
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు రెబ్బలు ఫ్రెష్ వేపాకు, అంగుళం తరిగిన పచ్చి పసుపు కొమ్ము ముక్కలు ( Turmeric Pickle )వేసుకోవాలి.
అలాగే నానబెట్టుకున్న ఓట్స్ ను వాటర్ తో సహా వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్నచోట మాత్రమే కాకుండా ముఖం మొత్తానికి పట్టించి 20 నుంచి 30 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.
"""/" /
అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.చివరిగా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మొటిమలు ఎంత తీవ్రంగా ఉన్నా సరే క్రమంగా మాయమవుతాయి.
మొటిమలు తాలూకు మచ్చలు సైతం తగ్గుముఖం పడతాయి.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
కేవలం పది రోజుల్లోనే ఈ వండర్ ఫుల్ రెమెడీ మీకు మంచి రిజల్ట్స్ అందిస్తుంది.
ఐటీ జాబ్స్ కోసం ఇంత పోటీనా.. ఈ వీడియో చూస్తే స్టూడెంట్ల గుండెలు అదిరిపోతాయి!