మధుమేహం అదుపులో ఉండాలా..అయితే ఈ టీ తాగండి!
TeluguStop.com
రక్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటమే మధుమేహం.దీనిని అందరూ షుగర్ వ్యాధి అని కూడా అంటారు.
ధీర్ఘకాలిక వ్యాధి అయిన ఈ మధుమేహం ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో పీల్చి పిప్పి చేస్తోంది.
ఒక్క సారి వచ్చిందంటే జీవిత కాలం పట్టి పీడించే మధుమేమాన్ని పూర్తిగా నివారించే చికిత్స ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు.
కేవలం అదుపు చేసే మందు మాత్రమే ఉన్నాయి.ఇక ఈ ప్రాణాంతక వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే.
హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే రిస్క్ పెరుగుతుంది.అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మధుమేహాన్ని ఎల్లప్పుడూ కంట్రోల్‌లో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
అయితే కేవలం మందుల ద్వారానే కాదు.కొన్ని కొన్ని ఆహారాల ద్వారా కూడా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసుకోవచ్చు.
ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో పుదీనా టీ అద్భుతంగా సమాయపడుతుంది.
పుదీనా టీ చేయడం పెద్ద కష్టమైన పని కూడా కాదు.ఒక గ్లాస్ వాటర్‌లో గుప్పెడు పుదీనా ఆకులు చేర్చి.
బాగా మరిగించి ఆ తర్వాత వడబోసుకోవాలి.ఇప్పుడు ఇందులో కొద్దిగా తేనె మరియు నిమ్మ రసం కలిపితే పుదీనా టీ సిద్ధమైనట్టే.
శరీరంలో చెడు కొవ్వు స్థాయిలను తగ్గించి.రక్తంలోని చెక్కర స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచే శక్తి పుదీనా టీకి ఉంది.
కాబట్టి, ఈ పుదీనా టీని ఒక కప్పు చప్పున ప్రతి రోజు ఉదయం తీసుకుంటే మంచిది.
"""/" /
ఇక పుదీనా టీ తీసుకోవడం వల్ల తలనొప్పి, ఒత్తిడి, వికారం, వాంతులు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
అలాగే పుదీనా టీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.మరియు జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా వేగవంతం అవుతుంది.
కాబట్టి, మధుమేహం వ్యాధి గ్రస్తులు మాత్రమే కాదు.అందరూ పుదీనా టీని సేవించడవచ్చు.
ఛీ.. ఇదేం పాడు బుద్ధి.. బికినీలో ఉన్న విదేశీయుల్ని సీక్రెట్‌గా వీడియో తీశాడు.. చూడండి!