గురకతో ఇబ్బంది పడుతున్నారా..పుదీనాతో చెక్ పెట్టండిలా!
TeluguStop.com

సాధారణంగా స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందికి గురక పెడుతూ గుర్రుగా పడుకునే అలవాటు ఉంటుంది.


గురక పెట్టే వారి సంగతి పక్కన పెడితే.వారి పక్కనే నిద్రించే వారికి మాత్రం నరకమనే చెప్పాలి.


గురక సౌండ్ తట్టుకోలేక.ప్రశాంతంగా నిద్రించలేక నానా ఇబ్బందులు పడుతుంటారు.
గురక అనేది చిన్న సమస్యే అయినప్పటికీ.నిర్లక్ష్యం చేస్తే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే గురక సమస్యను నివారించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అయితే గురకను నివారించడంలో పుదీనా అద్భుతంగా సహాయపడుతుంది.
వంటల్లో విరి విరిగా ఉపయోగించే పుదీనాను ఔషధాల సంజీవనిగా కూడా చెబుతుంటారు.పుదీనాలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, ఐరన్, పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు పుదీనాలో నిండి ఉంటాయి.
అందుకే పుదీనా ఎన్నో జబ్బులను నివారిస్తుంది. """/"/
ముఖ్యంగా గురక సమస్యతో బాధ పడే వారికి పుదీనా అద్భుతంగా సహాయపడుతుంది.
కొన్ని ఫ్రెష్ పుదీనా ఆకులను తీసుకుని క్రష్ చేసి వాటర్‌లో వేసి బాగా మరిగించి వడబోసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్‌లో కొద్దిగా తేనె మిక్స్ చేసి సేవించాలి.ఇలా పడుకునే గంట ముందు ప్రతి రోజు తీసుకుంటే.
గురక రాకుండా ఉంటుంది.అలాగే ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, తల నొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయి.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు.ఆస్తమా వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.
ప్రశాంత నిద్ర మీ సొంతం అవుతుంది.అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని పుదీనాను అతిగా మాత్రం తీసుకోరాదు.
పుదీనా ఓవర్‌గా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబట్టి, పుదీనాను మితంగానే తీసుకోండి.
ఆ సెంటిమెంట్ ప్రకారం బాలయ్య అఖండ2 రికార్డులు సృష్టిస్తుందా.. ఏం జరిగిందంటే?