ఈనెల 29న వరంగల్ లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటన..: భట్టి
TeluguStop.com
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ నేతల భేటీ ముగిసింది.
సమావేశం ముగిసిన అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈనెల 26న చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహించే బహిరంగ సభకు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు.
ఈ క్రమంలోనే సభలో ప్రకటించనున్న దళిత, గిరిజన డిక్లరేషన్ పై చర్చించినట్లు భట్టి వెల్లడించారు.
ప్రజల నుంచి సేకరించిన కొన్ని అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.కాగా ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా ఈనెల 29వ తేదీన వరంగల్ లో నిర్వహించే బహిరంగ సభా వేదికగా మైనార్టీ డిక్లరేషన్ ను కూడా పార్టీ ప్రకటించనుంది.
దాంతో పాటు వచ్చే నెలలో ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
Birthright Citizenship : ట్రంప్ నిర్ణయంపై భారత సంతతి నేతల ఫైర్