కామంతో కళ్లు మూసుకుపోయి కన్నకూతురినే గర్భవతి చేసిన తండ్రి…చివరికి…
TeluguStop.com
ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు కామంతో కళ్లు మూసుకుపోయి కడుపున పుట్టిన ఆడపిల్లల పైనే చెయ్యి వేస్తున్నారు.
తాజాగా ఓ కీచక తండ్రి తన సొంత కూతురిపైనే కన్నేసి ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి చివరికి గర్భవతిని చేసిన ఘటన దేశంలోని హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి పంచకుల అనే ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.
అయితే ఇతడు కుటుంబాన్ని పోషించడం కోసం గ్రామంలోని చిన్నచిన్న పనులు చేస్తూ ఉండేవాడు.
అయితే ఇతడికి కామవాంఛలు కొంతమేర ఎక్కువగా ఉండేవి.ఇతడు కట్టుకున్న భార్యపై మోజు తీరిపోవడంతో ఏకంగా కడుపున పుట్టిన కన్న కూతురిపై కన్నేశాడు.
ఇందులో భాగంగా మైనర్ బాలిక కు మాయమాటలు చెప్పి లోబర్చుకొని పలుమార్లు దారుణంగా అత్యాచారంచేశాడు.
అంతేకాక ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.దీంతో బాలిక ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా కిక్కురుమనకుండా ఉండిపోయింది.
అయితే తాజాగా బాలిక కడుపునొప్పితో తీవ్రంగా బాధ పడుతుండడంతో బాలిక తల్లి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించింది.
అయితే ఈ క్రమంలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు చెప్పిన విషయాన్ని విన్నటువంటి బాలిక తల్లి ఒక్కసారిగా ఖంగు తింది.
ఇందులో బాలిక అప్పటికే తొమ్మిది నెలల గర్భవతి అని, శిశువు కూడా మరణించాడని తెలిపారు.
దీంతో వెంటనే బాలిక తల్లి ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే పోలీసులు విచారణలో భాగంగా బాలిక గర్భవతి కావడానికి బాలిక తండ్రి కారణమని తెలుసుకున్నారు.
దీంతో ఆ కీచక తండ్రి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
ఆ డైరెక్టర్లతో ప్లాన్ చేయొచ్చుగా బాలయ్యా.. మోక్షజ్ఞ విషయంలో ఇలా చేయడం రైటా?