అక్క మొగుడే కదా అని చనువుగా ఉంటే… చివరికి…

ప్రస్తుత కాలంలో కొందరు తమ లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం వావి,వరుసలు మరచి ప్రవర్తిస్తూ మైనర్ బాలికల జీవితాలను పసి మొగ్గలోనే విచ్ఛిన్నం చేస్తున్నారు.

తాజాగా  ఓ మైనర్ బాలిక తన అక్క మొగుడే కదా కొంతమేర బావతో చనువుగా మాట్లాడడంతో అతడు ఏకంగా బాలిక మాయమాటలు చెప్పి లొంగదీసుకుని గర్భవతిని చేయగా చివరికి అబార్షన్ చేయించడంతో అది కాస్త వికటించి మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందినటువంటి కంచిలి మండలం లో  ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది.

  ఈ మైనర్ బాలిక అక్క మొగుడు వృత్తి నిమిత్తమై వేరే రాష్ట్రంలో నివాసం ఉంటున్నాడు.

అయితే ఇటీవల కాలంలో అతడు తన భార్య ను చూసేందుకు మైనర్ బాలిక ఇంటికి రావడంతో అక్క మొగుడు కావడంతో ఆమె కొంతమేర సన్నిహితంగా మెలిగేది.

ఈ క్రమంలో అతడు మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.పలు మార్లు శారీరకంగా కలిశాడు.

అనంతరం అతడు ఉద్యోగ నిమిత్తం  ప్రాంతానికి వెళ్ళిపోయాడు.అయితే అతడు వెళ్లిపోయిన తర్వాత మైనర్ బాలిక గర్భవతి అని తెలియడంతో ఈ విషయం బయటికి తెలిస్తే తమ కుటుంభం పరువు పోతుందని బావించిన బాలిక కుటుంబ సభ్యులు ఆమెకు అబార్షన్ చేయించాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో దగ్గరలో ఉన్నటువంటి వైద్యురాలిని సంప్రదించి మైనర్ బాలికకు అబార్షన్ చేయించారు.

కానీ అబార్షన్ కాస్త వికటించడంతో మైనర్ బాలిక మృతి చెందింది.దీంతో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే  మృతురాలి తల్లిదండ్రులను సంప్రదించి వారు తెలిపిన టువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వీడియో: బైక్‌పై పిల్లోడు ఉన్నా.. స్టంట్స్ చేశాడు.. మండిపడుతున్న నెటిజన్లు..