మైనర్ బాలికపై అఘాయిత్యం.. హత్య..!
TeluguStop.com
సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది.దేశంలో రోజురోజుకు కామాంధుల ఆగడాలు తరగడం లేదు.
చిన్న పిల్లల నుండి కాటికి కాలు చాపిన ముసలి వాళ్ళ వరకు అందరు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు.
కామాంధుల కామవాంఛ కోసం అమ్మాయిల నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు.దేశంలో ప్రభుత్వాలు మహిళల రక్షణ కొరకు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలను తీసుకొచ్చినా అప్పటికి కామాంధుల ఆగడాలను అరికట్టలేక పోతుంది.
తాజాగా మరో బాలిక కామాంధుల వికృత చేష్టలకు బలైయ్యింది.ఈ ఘటన హర్యానాలోని పాల్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.హర్యానాలోని పాల్వల్ జిల్లాలోని హోడల్ గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా కొంత మంది దుండగులు ఆమెను ఎత్తుకెళ్లిపోయారు.
కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల మొత్తం వెతికారు.వారికి చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే మరసటి రోజు గ్రామస్తులు పొలాల వైపు వెళ్లగా అక్కడ చిన్నారి మృతదేహం కనిపించింది.
గ్రామస్తులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు.హుటాహుటిన అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి బోరున విలపించారు.
బాలికపై దుండగులు అఘాయిత్త్యానికి పాల్పడి అతి కిరాతకంగా చంపేసినట్లు పోలీసులకు వెల్లడించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పోస్టుమార్టు నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఇక్కడ ఎవ్వరూ ఎవర్నీ సపోర్ట్ చెయ్యరు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు వైరల్!