మైనర్ డ్రైవింగ్ చేస్తూ వ్యక్తి మరణానికి కారణం-మైనర్ తల్లిపై కేసు నమోదు రిమాండ్ కి తరలింపు.
TeluguStop.com
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై,వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని,జిల్లా వ్యాప్తంగా మైనర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారిపై 07 కేసులు నమోదు చేసినట్లు డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రుద్రంగి మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో తేదీ: 18.
12.2024 రోజున రెండు ద్విచక్ర వాహనలు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందినారు.
రుద్రంగి మండలానికి చెందిన గడ్డం లక్ష్మి అనే మహిళ కొడుకు మైనర్ అయినప్పటికీ తనకి వాహనం ఇవ్వడం వలన తెలిసి తెలియని డ్రైవింగ్ తో ప్రమాదం చేయడం వలన కంటే.
రాములు, వయసు 72 కు తీవ్రగాయాలు కావడంతో రక్తస్రావం ఎక్కువ అయి మార్గమధ్యంలో మృతి చెందాడం జరిగింది.
కంటే నర్సయ్య @రెడ్డి ఫిర్యాదు మేరకు మైనర్ కు ద్విచక్ర వాహనం ఇచ్చిన మైనర్ వ్యక్తి తల్లి గడ్డం లక్ష్మి పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఈ రోజు జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది.
జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక.మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులు, వాహన యజమానుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయబడుతాయని,వారి భద్రత తల్లిదండ్రుల బాధ్యత హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పట్టుబడిన మైనర్లకు,వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందని, మైనర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారిపై 07 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్న ఈజీగా ఈ ఆయిల్ తో చెక్ పెట్టొచ్చు.. తెలుసా?