బ్యాంకులో బాలుడి చోరీ.. ఎన్ని లక్షల దోచేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
బ్యాంకుల్లో చోరీ చేసే వాళ్లు బలంగా, చేతిలో తుపాుకులు, మారణాయుధాలతో ఉంటారనే అనుకుంటాం మనమంతా.
కానీ ఓ బ్యాంకులో మాత్రం బాలుడి దొంగతనానికి పాల్పడ్డాడు.మొత్తానికి 35 లక్షలు కాజేసి అందిరనీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
అసలు ఆ అబ్బాయి చోరీకి పాల్పడతాడని ఎవరూ అనుకోరు.అదే అతనికి ప్లస్ అయింది.
బ్యాంకు యజమానులకు మైనస్ అయింది.అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఇందులో బాలుడితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు.అసలేమైంది, ఎక్కుడ ఈ దొంగతనం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబ్ పటియాలలోని షెరాన్ వాలా గేట్ ప్రాంతంలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ చోరీ జరిగింది.
క్షణాల్లోనే ఓ బాలుడు 35 లక్షల రూపాయలను కాజేశాడు.సీసీటీవీల్లో సంబంధిత దృశ్యాలు నమోదు అయ్యాయి.
బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా.బాలుడిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు.
25 ఏళ్ల ఓ యువకుడితో బాలుడు బ్యాంకులోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.25 నిమిషాల పాటు రెక్కీ నిర్వహించి ఎవరి కంటా పడకుండా డబ్బు దోచుకెళ్లారని వివరించారు.
ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన డబ్బును బ్యాంకు అధికారి క్యాష్ కౌంటర్ బయట ఉంచిన సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.