నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు మంత్రులు..: జగదీశ్ రెడ్డి

నల్లగొండ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Jagadish Reddy ) అన్నారు.

గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలిపారు.పూటకో మాట మార్చే పార్టీ కాంగ్రెస్( Congress ) అని ప్రజలకు అర్థమైందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

రుణమాఫీపై మాట మార్చారన్నారు.అన్నదాతలను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని ఆరోపించిన జగదీశ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) బూతులు, అబద్దాలతో కాలం వెల్లదీస్తున్నారని పేర్కొన్నారు.

నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు మంత్రులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సాగర్ డ్యామ్ మీదకు వెళ్లే దమ్ము కాంగ్రెస్ వాళ్లకు లేదని ఎద్దేవా చేశారు.

మజాకా వల్ల సందీప్ కిషన్ కెరియర్ సెట్ అవుతుందా..?