వరంగల్ కోటను సందర్శించిన మంత్రులు

వేయి స్తంభాల దేవాలయం ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపం నిర్మాణ పనులు 90% పూర్తి అయ్యాయని త్వరలోనే కళ్యాణ మండపం పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

ఖిలా వరంగల్ కోటను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలసి సందర్శించారు.

కోటలో జరుగుతున్న లేజర్ లైట్ శిల్పాల మధ్య ఉన్న విద్యుత్ దీపాలను కేంద్ర మంత్రి తిలకించారు.

తెలంగాణ రెండో రాజధానిగా ఉన్న వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా స్మార్ట్ సిటీ, హెరిటేజ్, అమృత్ పథకాలతో అభివృద్ధి చేశామని వీటికి తోడు కేంద్ర నిధులతో అవుటర్ రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తున్నామని, అంతేకాకుండా తెలంగాణ లో ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం ప్రసాద్ స్కిం ను ఏర్పాటు చేశామని అన్నారు.

వరంగల్ అభివృద్ధి చెందాలంటే విమాన సౌకర్యాలు ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పెద్ద విమానాలు నడిచేందుకు వీలుగా రన్వే స్థలాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించ లేదని ప్రస్తుతం ఉన్న రన్వే పైన త్వరలోనే చిన్న విమానాలు ఎగిరేందుకు కృషి చేస్తానని, ఖిలా వరంగల్ కోటలో మరుగుదొడ్ల విషయం తన దృష్టికి వచ్చిందని తక్షణమే వాటిని ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు వేయి స్తంభాల దేవాలయం చుట్టూ కోటలో మాదిరిగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

నిజ్జర్ హత్య కేసు : భారత్‌పై మరోసారి ఆరోపణలు చేసిన ఇండో కెనడియన్ నేత జగ్మీత్ సింగ్