అబద్ధాలు చెప్పటంలో గోబెల్స్ ని మించిపోయారు :వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
TeluguStop.com
పల్నాడు జిల్లాలో అధిక వర్షపాతంతో నష్టపోయిన పంట పొలాలని అధికారులతో కలిసి ఇప్పటికే పరిశీలించాం.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి ఇప్పుడు వచ్చి వ్యవసాయం గురించి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరం.
రైతుల పరామర్శకు వచ్చినప్పుడు రైతుల గురించి మాట్లాడాలి.పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ మాట్లాడటం అవసరం లేదు.
టిడిపి పాలన లో పంట నష్టపరిహారం ఎప్పుడు చెల్లించలేదు.ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు.
గత మూడు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం క్రమం తప్పకుండా సబ్సిడీ చెల్లిస్తూ వస్తుంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి బటన్ లను నొక్కుతున్నారని చంద్రబాబు విమర్శించడం విడ్డూరం.
అక్కడ మీటింగ్ కి వచ్చిన వాళ్లలో ఏ పథకం ద్వారా ఎవరు ఎంత లబ్ధి పొందారు అని చేతులు ఎత్తమని అడిగితే నిజం తెలిసేది.
వామ్మో.. అక్కడ ప్రతి ఒక్క మహిళకి ఆరు అడుగులపైనే జుట్టు.. ఎందుకంటే?