చంద్రబాబు లోకేష్ కు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడే హక్కు లేదు – మంత్రి విడుదల రజిని

చంద్రబాబు లోకేష్ కు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని .

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం సంజీవినిలా ఆరోగ్యశ్రీని తీసుకువస్తే అలాంటి ఆరోగ్యశ్రీని చంద్రబాబు ప్రభుత్వంలో పట్టించుకునే దాఖలాలు లేవన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చారన్నారు.జగనన్న ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు అనేక రోగాలకు సంబంధించి వైద్యం చేయిస్తున్నాడు.

అలాంటి ఆరోగ్యశ్రీ గురించి చంద్రబాబు, లోకేష్ ఏదిబడితే అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మంత్రి రజిని మండిపడ్డారు.

జగనన్న ప్రభుత్వం వచ్చాక 1050 ప్రొసీజర్లు ఆరోగ్యశ్రీలో ఉంటే దాన్ని 3250 కి పెంచి ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పేద ప్రజల ప్రాణాలు కోసం కార్పొరేట్ స్థాయిలో అనేక మంది పేద కుటుంబాలకు భరోసా కల్పించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు.

ఇప్పటివరకు దాదాపు 8300 కోట్లు పైగా ఆరోగ్యశ్రీ కింద, ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగిందన్నారు.

ఒక్క ఆరోగ్యశ్రీకే 3000 కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు.అంతేకాకుండా ట్రీట్మెంటు తీసుకున్న పేషెంట్ ఎవరిమీద ఆధార పడకూడదు అనే దృఢ సంకల్పంతో జగనన్న రోజుకు ఆ పేషంటుకు 225 రూపాయలు చొప్పున ఆరోగ్య ఆసరా క్రింద ఎంతోమంది పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుందన్నారు.

పేద ప్రజల ఆరోగ్యం కోసం జగనన్న ప్రతిక్షణం పరితపిస్తూ ఉంటే ఇన్ని తెలిసి కూడా తెలియనట్లు చూసి కూడా చూడనట్లు చంద్రబాబు, లోకేష్ జగనన్న ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలని చూస్తున్నారు.

చంద్రబాబు నాయుడు చెప్పే బూటకపు మాటలను ఈ రోజున ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!