బీసీల‌పై హ‌త్యాప్ర‌య‌త్నానికి పాల్ప‌డ్డవారిని ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలిపెట్టం...మంత్రి విడదల రజని

బీసీల ద్రోహిగా చంద్ర‌బాబునాయుడు చ‌రిత్ర‌లో నిలిచిపోతాడ‌నేదానికి మాచ‌ర్ల ఘ‌ట‌న కూడా తాజా నిద‌ర్శ‌నం బీసీల‌పై హ‌త్యాప్ర‌య‌త్నానికి పాల్ప‌డ్డవారిని ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలిపెట్టం వారంద‌రిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం శాంతిభ‌ద్ర‌త‌లు ప‌ర్య‌వేక్షించేందుకు ఎలాంటి చ‌ర్య‌ల‌కైకా వెనుకాడ‌బోం అమాయ‌క బీసీల‌పై దాడుల‌కు తెగ‌బడిన వారు ఎలాంటి వారైనా స‌రే చ‌ర్య‌లు తీసుకుంటాం ఇదేం క‌ర్మ ప్రోగ్రామ్ పేరును బీసీల‌పై దాడులు.

తెలుగుదేశం పార్టీ మార్చుకోవాలి బీసీల్లో వైసీపీకి పెరుగుతున్న ఆద‌ర‌ణ చూసి చంద్ర‌బాబునాయుడు ఓర్చుకోలేక‌పోతున్నారు.

బీసీలంతా జ‌గ‌న‌న్న వెన్నంటి ఉన్నార‌నే క‌క్ష్య‌తో టీడీపీ గూండాల‌పై బీసీల‌పై దాడుల‌కు దిగుతున్నారు మాచ‌ర్ల లో నిన్న రాత్రి మా బీసీ సోద‌రుల‌పై టీడీపీ గూండాలు దాడుల‌కు తెగ‌బ‌డ్డారు వైసీపీ ఈ దుశ్చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తోంది ఇలాంటి దాడుల‌కు తెగ‌బ‌డేవారిని మేం వ‌దిలిపెట్టం.

బీసీల జోలికి ఎవ‌రు వ‌చ్చినా వారి సంగ‌తి తేలుస్తాం ప్ర‌శాంతంగా ఉన్న ప‌ల్నాడులో తెలుగుదేశం పార్టీ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది బీసీల‌పై జ‌రిగిన దాడికి చంద్ర‌బాబునాయుడే బాధ్య‌త వ‌హించాలి టీడీపీ గూండాల రాళ్ల దాడిలో గాయ‌ప‌డిన మా బీసీ సోద‌రుల‌ను ప‌రామ‌ర్శించాల్సింది పోయి చంద్ర‌బాబు, లోకేష్ రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతున్నారు.