లోకేష్ కు సవాల్ విసిరిన మంత్రి రజనీ

గుంటూరు: లోకేష్ కు సవాల్ విసిరిన మంత్రి రజనీ.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ.

ఆరోగ్య శ్రీ పై చర్చకు నేను సిద్దం.లోకేష్ సిద్దమా.

లోకేష్ పదే పదే ఆరోగ్య శ్రీ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.ప్రజలకు ఆరోగ్య బద్రత కల్పిస్తుంటే తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు.

ఆరోగ్యశ్రీ పై బహిరంగ చర్చకు నేను సిద్దం మీరు రెఢీనా.ఆరోగ్యశ్రీని వెంటిలేటర్ పై ఉంచింది టీడీపీ ప్రభుత్వం.

పేదల ప్రజలు ప్రాణాలు కాపాడేందుకు వైఎస్సార్ తెచ్చారు.ఎందరో పేదల ప్రాణాలు కాపాడి వైఎస్సార్ దేవుడయ్యారు.

3600 జబ్బులకు ఆరోగ్యశ్రీ క్రింద వైద్యం అందిస్తున్నారు.టీడీపీ ప్రబుత్వంలో ఎడాదికి వెయ్యి కోట్లు ఖర్చుపెట్టింది.

జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి 3600 కోట్లు ఖర్చు చేస్తుంది.ఇప్పటి వరకు 36 లక్షల మంది ప్రజలకు ఆరోగ్య శ్రీ క్రింద వైద్య అందించారు.

రూ‌.5 లక్షల లోపు ఆదాయం ఉన్న అందరికీ ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది.

టీడీపీ ప్రభుత్వంలో సగటున రోజుకు 1570 పేషెంట్ ఆరోగ్య శ్రీ క్రింద వైద్య సేవలు పొందే వీరు.

ఈ ప్రభుత్వంలో రోజుకు 3600 మంది ఆరోగ్య శ్రీ పధకం ద్వారా వైద్యం పొందుతున్నారు.

అన్నిరకాల క్యాన్సర్‌లకు ఉచితంగా ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నాం.

అనుకున్నదంతా అయ్యింది.. కెనడాలో కాన్సులర్ క్యాంప్‌లు రద్దు చేసిన భారత్