Uttam Kumar Reddy : సీఎం జగన్, కేసీఆర్ లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

మాజీ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్ లపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Telangana Minister Uttam Kumar Reddy ) సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ ఇరువురు కలిసి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

బుధవారం మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.కేసీఆర్, జగన్ కలసి ఏకాంత చర్చలు జరిపినప్పుడు అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలో కృష్ణా రివర్( Krishna River ) పై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టి నీరు తరలించిందని ఆరోపించడం జరిగింది.

"""/"/ ఇదే సమయంలో కృష్ణా జలాలలో ఏపీకి 500 టిఎంసిలు ఇవ్వాలని కేసీఆర్( CM KCR ) ప్రతిపాదించలేదా అని నిలదీశారు.

ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు కేసీఆర్ ఏనాడూ అడ్డు చెప్పలేదు అని విమర్శించారు.మంచి నీళ్లు ఆ రాష్ట్రానికి వెళ్తుంటే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు.

ఆయన లక్ష కోట్లు దోచుకుని కూలిపోయే కాలేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project )ను నిర్మించారని విమర్శించారు.

మేడిగడ్డ కుంగుబాటుపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు.అన్నారం ఇంకా సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఏంబీకీ అప్పగించే అంశంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

భారతీయులకు కొత్తగా 2.5 లక్షల యూఎస్ వీసా అపాయింట్‌మెంట్‌లు.. స్పందించిన కమ్యూనిటీ నేత!