పవన్ కళ్యాణ్ పై మంత్రి ఉషశ్రీ చరణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి రెండో దశ యాత్రలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్( Minister Ushasree Charan ).

పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.మహిళలంటే పవన్ కళ్యాణ్ కి గౌరవం లేదని అన్నారు.

వాలంటీర్లను కించపరిచేలా ఆయన మాట్లాడటం బాధాకరమని అన్నారు.సీఎం జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ మరియు వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.

"""/" / అంతేకాదు ఈ వాలంటీర్ల వ్యవస్థను( System Of Volunteers ) ఇతర దేశాల ప్రతినిధులు సైతం పరిశీలించి.

తమ దేశములో అమలు చేయటానికి కసరత్తు చేస్తున్నారని స్పష్టం చేశారు.ఇంతటి బాధ్యతాయుతమైన వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేయటం సరికాదని అన్నారు.

రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా గడపగడపకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను.ప్రజలకు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ పట్ల ప్రజలలో వ్యతిరేకత తీసుకురావడానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కుట్రపన్నారని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ ని చూడగానే ఆడపిల్లలు భయపడే పరిస్థితి నెలకొందని.వాలంటీర్ల వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ.

చెప్పాలంటూ మంత్రి ఉషాశ్రీ చరణ్ డిమాండ్ చేశారు.

నన్ను క్షమించండి..యానిమల్ లాంటి సినిమా మరోసారి చెయ్యను: రణబీర్ కపూర్