వైరాకు మంత్రి తుమ్మల.. సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు పరిశీలన
TeluguStop.com
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం( Wyra Assembly Constituency )లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటించారు.
ఇందులో భాగంగా నియోజకవర్గంలోని మండల హెడ్ క్వార్టర్ లో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను ఆయన పరిశీలించారు.
ఈ క్రమంలోనే అధికారులను అడిగి ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలను మంత్రి తుమ్మల తెలుసుకున్నారు.
సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల తెలిపారు.వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందిస్తామని వెల్లడించారు.
కాగా ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డోర్ తీసి మనుషులన్న కారులోకి దూరిన ఎలుగుబంటి.. వీడియో చూస్తే..