కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
TeluguStop.com

కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.


ఈ దాడులను తాము ముందే ఊహించామన్నారు.దేశంలో ప్రజాస్వామ్యం ఎటు పోతుందో అర్థం కావట్లేదని తెలిపారు.


కేంద్ర బీజేపీ ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆరోపించారు.రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ ఎవరికీ భయపడదని, తాటాకు చప్పుళ్లకు భయపడమని స్పష్టం చేశారు.అంత భయపడితే హైదరాబాద్ లో ఎందుకు ఉంటామని ప్రశ్నించారు.
అదేవిధంగా దాడుల అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్న ఆయన ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని వెల్లడించారు.
ఇదేందయ్యా ఇది.. ఊరంతా యూట్యూబర్లే!