రేపు ఎన్నికలు పెట్టిన కేసీఅర్ ప్రభుత్వం సిద్ధం అంటున్న మంత్రి తలసాని..!!

దేశంలో జమిలి ఎన్నికలు( Jamili Elections ) జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి."ఒకే దేశం ఒకే ఎన్నికల" నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు దీంతో ఈ ఏడాది చివరిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇటువంటి క్రమంలో బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav ) జమిలి ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్( KCR ) ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

రేపే షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు పెట్టిన సిద్ధం అని అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో బీజేపీ గెలిచే అవకాశం లేదని అన్ని సర్వేలలో ఫలితాలు వచ్చాయి.

"""/" / ఉన్నట్లుండి వేవ్ ను మార్చితే ఫలితాలు మారుతాయమో అన్న భ్రమలో బీజేపీ ఉందని విమర్శించారు.

రాబోయే లోక్ సభ ఎన్నికలలో "వన్ నేషన్ వన్ ఎలక్షన్"( One Nation One Election ) పేరుతో బిల్లు పెడతారనే ప్రచారం ఉందని తలసాని వ్యాఖ్యానించారు.

దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ( BJP ) పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని అందువల్లే ముందస్తు ఎన్నికలకు మోదీ ప్రభుత్వం వెళుతున్నట్లు పేర్కొన్నారు.

"వన్ నేషన్ వన్ ఎలక్షన్" అనే నినాదం ఇప్పటిది కాదని ఎప్పటినుంచో మోదీ( PM Modi ) ఈ దిశగా ఆలోచన చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

మోదీ క్రేజీ దేశంలో పడిపోయిందని పేర్కొన్నారు.జమిలి ఎన్నికలు అంటే దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని తలసాని స్పష్టం చేశారు.

ఏపీలో జగన్, కేతిరెడ్డి ఓటమికి కారణాలివే.. కేటీఆర్ కు ఏపీ మంత్రి ఘాటు రిప్లై వైరల్!