హైదరాబాద్ బాలుడి హత్య ఘటనపై మంత్రి తలసాని ఆరా

హైదరాబాద్ లోని సనత్ నగర్ లో బాలుడి హత్య ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తలసాని వెల్లడించారు.

బాలుడిని హిజ్రా ఇమ్రాన్ హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.అయితే బాలుడి తండ్రి వసీంఖాన్, ఇమ్రాన్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే నిన్న ఇరువురి మధ్య వివాదం జరిగింది.మరోవైపు ఇమ్రాన్ ఇంటి ముందు క్షుద్రపూజల ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

బాలుడి హత్య నేపథ్యంలో ఇమ్రాన్ ఇంటిని స్థానికులు ధ్వంసం చేశారు.

అఖండ 2 తర్వాత నేనేంటో అందరికీ చూపిస్తా…. నన్ను చూసి నాకే పొగరు: బాలకృష్ణ