అంతర్జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారిణి గోలి శ్యామల గారిని అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారిని హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారిణి శ్రీమతి గోలి శ్యామల గారిని అభినందించారు.

మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు.

అందులో భాగంగా రాష్ట్రంలో అత్యున్నత క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు.శ్రీమతి గోలి శ్యామల గారు ప్రపంచంలోని సప్త సముద్రాలను ఈది తెలంగాణ రాష్ట్రానికి, మన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకరావలనే లక్ష్యం తో ఎంతో ప్రమాదకరమైన, కోల్డ్ వాటర్ తో కూడిన, లోతైన ప్రాంతమైన కేటాలినా ఐలాండ్ నుండి లాస్ ఏంజెల్స్ వరకు (సుమారు 36 కిలోమీటర్లు) జరిగిన స్విమ్మింగ్ అడ్వెంచర్స్ ను పూర్తి చేసి చరిత్ర సృష్టించిన తొలి తెలుగు మహిళ గా నిలిచినందుకు మంత్రి శ్రీ V.

శ్రీనివాస్ గౌడ్ గారు అభినందించి, ఘనంగా సన్మానించారు.గోలి శ్యామల గారు అంతర్జాతీయ స్థాయి వేదికలపై స్విమ్మింగ్ విభాగంలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకరావడం సంతోషంగా ఉందన్నారు.

"""/"/ గతంలో మన దేశం - శ్రీలంక దేశాల మధ్య ఉన్న హిందు మహా సముద్రంలో ఉన్న పాక్ జల సంధి (30 కిలోమీటర్లు) ను ఈదిన రెండో మహిళ గా చరిత్ర సృష్టించారన్నారు మంత్రి శ్రీ V.

శ్రీనివాస్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి KS శ్రీనివాస రాజు, MLR విద్యా సంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, గోలి శ్యామల భర్త దీపక్, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి ఉమేష్ గార్లు పాల్గొన్నారు.

వీడియో: మెరుపు వేగంతో ఢీ కొట్టిన కారు.. గాల్లో ఎగిరిపోయిన స్టూడెంట్..