పెట్టుబడులే లక్ష్యంగా సీఎం దావోస్ పర్యటన మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు..!!
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రేపటి నుంచి 18 వరకు విదేశీ పర్యటన చేపట్టనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన.దావోస్ లో( Davos ) జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కి రేవంత్ హాజరు కాబోతున్నారు.
ఈ ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ సంస్థలకు ఆహ్వానం పలకనున్నారు.ఇదిలా ఉంటే సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన సాగుతుందని తెలిపారు.ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫారంలో ( World Economic Forum ) వివరిస్తామని స్పష్టం చేశారు.
"""/" /
ఈ మూడు రోజుల పర్యటనలో 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలను బృందం కలుస్తుందని స్పష్టం చేశారు.
అదేవిధంగా అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో కూడా సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు.ఈ నెల 15న వెళ్లే దావోస్ బృందానికి సీఎం రేవంత్ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ముఖ్యమంత్రి కార్యదర్శి వీ శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్ రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల వ్యవహారాల విభాగం ప్రత్యేక కార్యదర్వి విష్ణువర్ధన్ రెడ్డి, మీడియా ప్రతినిధి కర్రి శ్రీరామ్, ముఖ్య భద్రతాధికారి తస్ఫీర్ ఇక్బాల్, ఉదయ సింహా, గుమ్మి చక్రవర్తి మరి కొంతమంది మంత్రులు వెళ్ళనున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ జాగ్రత్త పడితే అల్లు అర్జున్ బుక్కయ్యారా.. వివాదం విషయంలో ట్విస్టులివే!