చంద్రబాబు జీవితంలో మొట్టమొదటిసారిగా నిజం మాట్లాడారు – మంత్రి సీదిరి అప్పలరాజు

అమరావతి: మంత్రి సీదిరి అప్పలరాజు.చంద్రబాబు జీవితంలో మొట్టమొదటిసారిగా నిజం మాట్లాడారు.

2024 ఎన్నికలు టీడీపీని సమాధి కట్టే ఎన్నికలు.చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివి.

చంద్రబాబు పాడెక్కేశాను బ్రతికించండి అన్నట్టు మాట్లాడారు.మరలా తన భార్యను చంద్రబాబే రాజకీయాల్లోకి లాగారు సానుభూతి డ్రామా కోసం.

చంద్రబాబుకు సిగ్గు.ఎగ్గు ఉండవు.

ఎలాంటి నీచానికైనా దిగజారుతాడని నిరూపించుకున్నాడు.చంద్రబాబును ఆయన ఇంట్లో వాళ్లయినా వారిస్తారా అని నాకు డౌటు.

లేని విషయాన్ని ఎందుకు పబ్లిసిటీ చేస్తారని వారించరా చంద్రబాబుని.చంద్రబాబు పనులు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

చంద్రబాబు కర్నూలులో హైకోర్టు పెట్టడానికి వ్యతిరేకమన్నది నిజం.రాయలసీమలో చంద్రబాబును తన్ని తరిమేస్తారు.

ఉత్తరాఖండ్ లో హైకోర్టు మార్చుకో గలిగినపుడు ఏపీలో ఎందుకు కుదరదు.రాష్ట్ర అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అన్నారు సీఎం జగన్.

సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరు చంద్రబాబు లాంటి వ్యక్తులు.వీధి రౌడీలు కూడా మాట్లాడలేని భాష వాడుతున్నారు.

సీఎం జగన్ ను మీరు ఏం పీకగలరు.చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదు.

చంద్రబాబువి అన్నీ ఆర్భాటాలు.చంద్రబాబు పుట్టుకే ఒక 420.

సీఎం జగన్ ఏనాడూ నీలాగా ఏడుపు మాటలు మాట్లాడలేదు.సానుభూతి రాజకీయాలకు సీఎం జగన్ కు ఉన్న అవకాశం ఏ రాజకీయ నాయకుడికీ లేదు.

అయినా సీఎం జగన్ ఒంటరిగానే నడిచాడు.ఒంటరిగానే సీఎం అయ్యాడు.

సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడే స్థాయి చంద్రబాబుకు లేదు.చంద్రబాబు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు.

ప్రతిపక్ష పాత్ర కోసం బీజెపీ ఎదురుచూస్తోంది.చంద్రబాబు పోతేనే బీజేపీకి ప్రతిపక్ష పాత్ర.

రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా.పవన్ కళ్యాణ్ కు కూడా మోదీ ఇదే చెప్పి ఉంటారు.

పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నది చంద్రబాబు.ప్రజలకు ఏం చేశాడు కనుక చంద్రబాబుకు ఓటేయాలి.

పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెం నాయుడి మాటలు చంద్రబాబు నిజం చేశాడు.