హింసను ప్రేరేపించిందే చంద్రబాబు-రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి
TeluguStop.com
పుంగనూరులో జరిగిన ఘటన వెనుక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రేరిపిత చర్యలు ఉన్నాయని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు( Seediri Appalaraju ) అన్నారు.
శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
పుంగనూరు ఘటనలో ఏపి రాష్ట్ర పోలీసులు ఎంతో సహనంగా వ్యవహరించారని తెలిపారు.చంద్రబాబు కుట్రను కాని గమనించక పోయి ఉంటే ఎంతో ప్రాణ నష్టం జరిగేదని ఆవేదన చెందారు.
చంద్రబాబు కుట్ర రాజకీయాలకు సామాన్యులు బలి కావాలా అని ప్రశ్నించారు.పోలీసులు సంయమనం పాటించారు కాబట్టే 40 మంది పోలీసులకు తీవ్రంగా దెబ్బలు తగిలాయని అన్నారు.
పోలీసు వాహనాలను తగలబెట్టడం చూస్తే పూర్తి స్థాయి ప్రణాళిక వేసుకుని చంద్రబాబు వచ్చారని పోలీసుల్లో ఎవరినైనా చంపేస్తే పోలీసులు ప్రతి చర్యగా కాల్పులు జరిపితే కార్యకర్తలు చనిపోతే వాటి ద్వారా రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించాలనే పెద్ద ప్రణాళికతో చంద్రబాబు ముందుకు వచ్చారని అర్ధం అవుతుందని తెలిపారు.
చంద్రబాబు ముందస్తుగా ఇచ్చిన రూట్ ప్రణాళికను అప్పటికప్పుడు ఎందుకు మార్చినట్లు అనేది చంద్రబాబు కుట్ర ఆలోచనలకు ప్రతి రూపం అని తెలిపారు.
చంద్రబాబు తనయుడు లోకేష్( Nara Lokesh ) మా దెబ్బ చూశారా అని అనడం వెనుక వారి కుట్రలు బయట పడుతున్నాయని అన్నారు.
దత్త పుత్రుడు పవన్ కి కనీసం నైతిక విలువలు కూడా లేవు రాష్ట్రంలో పోలీసులు మీద దాడులు జరిగితే నోరు మెదపలేదని ఆరోపించారు.
పోలీసుల మీద జరిగిన దాడులపై పవన్ స్పందించాలంటే పవన్ కి ప్యాకేజి కావాలా అని ప్రశ్నించారు.
బిగ్ బాస్ 8 ఫినాలేలో సందడి చేసిన రామ్ చరణ్… రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?