మహిళల రక్షణ విషయంలో దేశం గర్వించే విధంగా పటిష్టమైన చర్యలు.. మంత్రి సత్యవతి రాథోడ్

మహిళల రక్షణ విషయంలో దేశం గర్వించే విధంగా, ఇతర రాష్ట్రాలు ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు తెలిపారు.

మహిళల అన్ని సమస్యల పరిష్కారానికి వన్ స్టాప్ సెంటర్ గా పని చేసే హైదరాబాద్ జిల్లా సఖీ కేంద్రానికి నేడు బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12, మిథిలా నగర్ లో రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మేయర్ శ్రీమతి గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్సీ శ్రీమతి వాణి దేవి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ దానం నాగేందర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య దేవరాజన్, కలెక్టర్ ఎల్.

శర్మన్, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్ రావు, ఆర్ అండ్ బి ఎస్.

ఈ పద్మనాభ రావు, ఇతర అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి వ్యాఖ్యలు.

హైదరాబాద్, మిథిలా నగర్ లో సఖీ కేంద్రానికి నేడు శంకు స్థాపన చేయడం చాలా సంతోషం.

స్థలాన్ని ఇచ్చినందుకు మేయర్, స్థానిక ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.సఖి కేంద్రాలు దేశ వ్యాప్తంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో వీటిని ఇక్కడి ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుంటోంది.

సఖీ కేంద్రానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చి పెద్ద భవనం నిర్మాణం చేస్తున్నాం.

మహిళల రక్షణ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో చర్యలు చేపడుతున్నాం.

"""/"/ గంజాయి వల్ల నేరాలు పెరుగుతున్నాయని, పిల్లలు బానిసలు అవుతున్నారని గమనించిన సిఎం కేసిఆర్ గారు దీనిని ఉక్కుపాదంతో అణచివేయాలని ఇటీవలే ప్రత్యేక సమావేశాలు పెట్టి నిర్ణయించారు.

పిల్లల విషయంలో తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలి.ఆడపిల్లల పట్ల నేరాలకు పాల్పడిన దోషులను కూడా సకాలంలో పట్టుకుని శిక్షిస్తున్నాం.

దేశంలోని సీసీ కెమెరాల్లో మన దగ్గర 2/3 ఉన్నాయంటే మన రాష్ట్రంలో ఎంత నిఘా ఉందో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ నగరంలోని మహిళల సమస్యల పరిష్కారం విషయంలో అందరిలో నమ్మకం, విశ్వాసం పెంచే విధంగా అన్ని సేవలు ఈ సఖీ కేంద్రంలో ఉంటాయి.

ఈరోజు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో ఈ కేంద్రం రావడం పట్ల సంతోషంగా ఉంది.

"""/"/ 33 జిల్లాలో సఖీ కేంద్రాల భవనాలకు స్థలాలు, నిధులు ఇచ్చి ప్రోత్సహించడం అనేది మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.

హైదరాబాద్ సఖీ కేంద్రాన్ని అన్ని ఏర్పాట్లతో నిర్మాణం చేస్తున్నాం.రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అప్పటికప్పుడు సొంత భవనాలు లేక, అద్దె భవనాలలో సఖీ కేంద్రాలు నిర్వహిస్తున్నాం.

అక్కడ కూడా త్వరలోనే సొంత భవనాలు నిర్మించి, అందులోకి తరలిస్తాం.మహిళల సమస్యల పరిష్కారం కోసం పోలీసుల ఆధ్వర్యంలో భరోసా కేంద్రం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, కలెక్టర్ ఆధ్వర్యంలో సఖీ కేంద్రం నడుస్తున్నాయి.

మహిళల పట్ల నేరాలు తగ్గించే విధంగా, వారికి న్యాయ పర సేవలు సకాలంలో ఇచ్చే విధంగా ఈ సఖీ కేంద్రాల ద్వారా పని చేస్తున్నాం.

బాహుబలి తీసినట్టు ఫీల్ అవుతున్నావ్.. బలగం డైరెక్టర్ ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నారా?