Minister RK Roja : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా( Minister RK Roja ) ఓ ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) గురించి మాట్లాడుతూ.

జాక్ పాట్ లో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.దీంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాక ఏపీ రాజకీయాలపై పడ్డారని పేర్కొన్నారు.

ఇప్పటికే వైఎస్ షర్మిలను ఏపీకి తరిమేరు.ప్రస్తుతం నన్ను ఎక్కడికి తరమాలో ఆయనకు అర్థం కావడం లేదు అని విమర్శించారు.

రేవంత్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే బాగుంటుంది. """/"/ కానీ సీఎం జగన్( CM YS Jagan ) పై.

నాపై ఆరోపణలు చేయడం సరైనది కాదని రోజా స్పష్టం చేశారు.ఇక చేపల పులుసు ప్రస్తావన తీసుకొస్తూ కావాలంటే ఏదైనా హోటల్ నుంచి రేవంత్ కి ఆర్డర్ పెడతా అంటూ పంచ డైలాగ్ లు వేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి.విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన హక్కులు దక్కాలన్నారు.

ప్రత్యేక హోదా( AP Special Status ) విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలను మోసం చేసింది.

విభజన హక్కుల పరిష్కరించకుండా కాంగ్రెస్ ఏపీపై కపట ప్రేమ చూపుతోందని అన్నారు.రాజకీయ లబ్ధి కోసమే ఏపీ రాజకీయాల్లో వైయస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు.

రాహుల్ నుంచి లబ్ధి కోసమే ఆమె రాజకీయాలు చేస్తున్నారు.అంటూ మంత్రి రోజా తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు.

వైరల్ ఫోటో : ఒకే చోట ప్రపంచంలోని అత్యంత పొట్టి , పొడవైన మహిళలు