తిరుపతి గంగమ్మకు సారెను సమర్పించిన మంత్రి రోజా..

రాష్ట్రంలో ప్రతిపక్ష శత్రువులు లేకుండా చూడాలని గంగమ్మను ప్రార్ధించినట్లు పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా అన్నారు.

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి రోజా.

రాష్ట్ర పండుగగా గంగమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని, అంగరంగ వైభవంగా జాతర జరుగుతున్నట్లు మంత్రి రోజా తెలిపారు.

ప్రభుత్వం తరఫున మంత్రిగా తాను మొదటిసారి తిరుపతి గంగమ్మకు సారెను సమర్పించానన్నారు.జాతరకు వచ్చే భక్తులకు గంగమ్మ దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

‘హరిహర వీరమల్లు’ సినిమా మీద హైప్ పెంచుతున్నారా..?