వాలంటీర్ వ్యవస్థను చూసి పవన్ కళ్యాణ్ వణికిపోతున్నాడు – మంత్రి రోజా

అమరావతి: మంత్రి ఆర్కే రోజా కామెంట్స్.పవన్ కల్యాణ్ కి జగన్ అంటే భయం అనుకున్నాం.

కానీ వాలీంటీర్స్ అంటే కూడా ఇంత భయం అని నిన్నే తెల్సింది.వాలీంటీర్ వ్యవస్థ వెంట్రుకను కూడా పవన్ కళ్యాణ్ పీకలేడు.

వాలంటీర్ వ్యవస్థను చూసి పవన్ కళ్యాణ్ వణికిపోతున్నాడు.కరోనా లాంటి విపత్కర సమయంలో వాలీంటీర్ లు ఎలాంటి సేవలు చేశారో దేశం మొత్తం చూసింది.

జగన్ కి అండగా ఉన్న వాలీంటీర్ వ్యవస్థను ఆపే శక్తి ఎవరికిలేదు.ఆడవాళ్లను అక్రమ రవాణా అని పిచ్చి మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మహిళా వాలీంటీర్స్ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పాలి.

లేదంటే వాళ్లే నీకు తగిన బుద్ధి చెప్తారు.కేంద్ర నిఘా వర్గాలు అంటూ పవన్ కళ్యాణ్ తప్పుడు లెక్కలు చెబుతున్నాడు.

Ncrb డేటా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.Ncrd డేటా ప్రకారం మిస్సింగ్ కేసుల్లో టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీ పేరే లేదు.

పక్కన ఉన్న తెలంగాణ 6వ స్థానంలో ఉంది.అక్కడి ముఖ్యమంత్రి ని అడిగే దమ్మూ నీకు ఉందా?తన తల్లి మీద తప్పుడు రాతలు రాయించింది టీడీపీ నే అర్ధరాత్రి ట్వీట్స్ పెట్టిన సంగతి మర్చిపోయావా?సంకరజాతీ నా కొడుకులు అంటూ మీ కార్యకర్తలను తిట్టిన బాలక్రిష్ణ పిలవగానే వెళ్లి షో లో పాల్గొన్నావు.

మిస్సింగ్ కి అక్రమ రవాణా కి తేడా కూడా తెలియని పవన్ కళ్యాణ్ ఉమెన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతున్నాడు.

జగన్ తెచ్చిన వాలీంటీర్ వ్యవస్థ అవినీతి రహిత పారదర్శక విప్లవం తెచ్చే వ్యవస్థ.