నారా లోకేష్ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా..!!
TeluguStop.com
ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబుని( Chandrababu Naidu ) అరెస్టు చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసే ప్రయత్నాలు చేయగా పోలీసుల అడ్డుకున్నారు.
ఈ క్రమంలో తండ్రి చంద్రబాబును అరెస్టు చేయడం పట్ల నారా లోకేష్( Nara Lokesh ) ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
"పిచ్చోడు లండన్ కి.మంచోడు జైలుకి.
ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం.FIR లో పేరు లేదు.
ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు.మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం.
నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్" అని కామెంట్ చేశారు.
"""/" /
అయితే లోకేష్ చేసిన కామెంట్ కి మంత్రి రోజా( Minister Roja ) ట్విట్టర్ లోనే కౌంటర్ ఇచ్చారు.
"మీ డాడీ.కేడి కాబట్టే అరెస్ట్ అయ్యాడు పిల్ల సైకో నారా లోకేష్.
మంచోడు కాదు సూట్ కేస్ కంపెనీలుతో ముంచేసినోడు మీ నాన్న చంద్రబాబు.కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాని జైలుకి పంపక.
జైలర్ సినిమాకి పంపిస్తారా? పప్పు మీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే `ఈకుంభకోణంలో విచారణ జరుపుకొండి.
` అని ధైర్యంగా చెప్పు.!! A1 చంద్రబాబని ఇక ఏ దేవుడు కాపాడలేడు.
మీ తాత.ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు సంతోషంగా ఉంటుంది.
బై బై తుప్పు.బై బై పప్పు.
" అని మంత్రి రోజా కౌంటర్ ట్వీట్ చేశారు.