ఐలమ్మ కు ఘన నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ....

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ గారు అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ఆమె 37వ వర్థంతి సందర్భంగా ఖమ్మం నగరం ధర్నా చౌక్ లోని ఐలమ్మ గారి విగ్రహానికి మంత్రి పువ్వాడ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సంధర్భంగా మీడియాతో మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తినిచ్చిందని అన్నారు.

విస్నూర్‌ దేశ్ముఖ్‌ ఆగడాలను ఎదురిస్తూ రైతాంగ సాయుధ పోరాటానికి నడుంబిగించిందన్నారు.రజాకార్ల గుండెల్లో దడ పుట్టించిన ఐలమ్మ సాయుధ పోరాటం చేస్తూనే ఉద్యమకారులకు అన్నం పెట్టిన అమ్మగా ఉద్యమకారుల హదయాల్లో నిలిచిందన్నారు.

ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలంగాణ సాధన ఉద్యమానికి ఊపిరిగా నిలిచిందని, అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నరు.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ తెలంగాణలో నిజాం సర్కార్ వ్యతిరేకంగా నాడు చేసిన అలుపెరుగని పోరాట పటిమ వీరనారి చాకలి ఐలమ్మ సేవలు తెలంగాణ సమాజం మరువదన్నారు.

ఆనాడు రజకులు నివసించే గ్రామీణ ప్రాంతంలో భూస్వాములకు ఉచితంగా వెట్టిచాకిరి చేసే వారిని వెట్టిచాకిరి చేయకపోతే రజకుల పైన దౌర్జన్యాలు చేసావారని వాటిని కళ్లారా చూసిన ఐలమ్మ వెట్టి చాకిరి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడి విముక్తి కల్పించిన ఘనత వీరనారి అయిలమ్మ దేనని కొనియాడారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ విజయ్ గారు, కార్పొరేటర్ కమర్తపు మురళి, తెరాస నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, జక్కుల వెంకట రమణ, కణతాల నర్సింహ రావు, షకీనా తదితరులు ఉన్నారు.

ఖర్జూరం తినేటప్పుడు మీరు కూడా ఈ మిస్టేక్ చేస్తున్నారా..?