జర్నలిస్ట్ కుటుంబానికి అండగా మంత్రి అజయ్

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మ‌రోసారి త‌న మంచి మనసును, ఉదార స్వ‌భావాన్ని చాటుకున్నారు.

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు పసుపులేటి సత్యనారాయణ కుటుంబానికి మంత్రి అజయ్ అండగా నిలిచారు.

వైద్య ఖర్చుల నిమిత్తం రూ.ఒక లక్ష రూపాయల విలువైన ఎల్వోసీ చెక్కును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంజూరు చేయించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన జర్నలిస్ట్ సత్యనారాయణ సూర్య దినపత్రిక జిల్లా బ్యూరో ఇంఛార్జిగా పనిచేస్తున్నారు.

వారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన నేపథ్యంలో విషయం తెలుసుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకురావాలని సూచించారు అనంతరం ఆస్పత్రి వైద్యులతో ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి చెప్పారు.

పేద కుటుంబం కావడంతో ఖరీదైన వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉండడంతో జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు దీంతో విషయం తెలుసుకొని తక్షణం స్పందించి సహాయం అందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిన లాభం లేదా… ప్రతివారం అలా చేయాల్సిందేనా?