యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి విమాన గోపురానికి ఒక కిలో బంగారము సమర్పించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి విమాన గోపురానికి ఒక కిలో బంగారాన్ని సమర్పించారు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

ఈరోజు కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకున్న ఆయనకు స్వస్తి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు అనంతరం స్వయంభు మూర్తుల దర్శనాన్ని కల్పించారు.

ఆలయంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు.అనంతరం విమాన గోపురానికి బంగారు తాపడము నకు ఒక కిలో బంగారాన్ని ఆలయ ఈఓ గీతా రెడ్డికి అందచేశారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ పద్ధతిలో ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు.స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందచేశారు ఆలయ ఈవో గీతారెడ్డి.

షాకింగ్ వీడియో: అడవి పిల్లి – విష సర్పం మధ్య భీకర పోరు..