సీఎం కేసీఆర్ మన దేశానికి ప్రధాని కావాలని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి
TeluguStop.com
సీఎం కేసీఆర్ మన దేశానికి ప్రధాని కావాలని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.
అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ముందుందని చెప్పారు.అందుకే అన్ని రాష్ట్రాలు నేడు తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ బీజేపీ లు వాస్తవాలు మాట్లాడాలని అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.నిజామా బాద్ జిల్లా వేల్పూర్ లో పర్యటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి పెద్దవాగుపై 15 కోట్లతో నిర్మించనున్న హై లెవల్ వంతెనకు, పడిగేల్ లో 66 లక్షలతో నవాబు లిఫ్ట్ మరమ్మతు పనులకు శంఖు స్థాపన చేశారు.
చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడారు.
హెచ్ 1 బీ వీసా మోసం .. అమెరికాలో భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష, భారీ జరిమానా